పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జులై 3
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ ఈనెల ఆరో తేదీన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని జిఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవనము నందు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ,(ఏపీ ఆదివాసీ జేఏసీ) రాష్ట్ర విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పూర్వపు సివిల్ సర్వీస్ సభ్యుడు డాక్టర్ టి.బాబురావు నాయుడు రచించిన ఉనికిని కోల్పోతున్న ఆదివాసీలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉదయం 9 గంటలకు అన్ని ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమక్షంలో పుస్తకావిష్కరణ జరుగుతుందన్నారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పూర్వపు సివిల్ సర్వీస్ సభ్యుడు డాక్టర్ టి.బాబురావు నాయుడు ప్రారంభ ఉపన్యాసంతో సమావేశం ప్రారంభం అవుతుందన్నారు.అలాగే ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకుల ఉపన్యాసాల అనంతరం భవిష్యత్ కార్యాచరణ యునైటెడ్ ఫారం ఫర్ రైట్స్ ఆఫ్ ఇండిజన్యూస్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అనే ముఖ్య ఉద్దేశంతో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కావున రాష్ట్ర,జిల్లా శాఖల నాయకులు,ప్రతినిధులు,సభ్య సంఘాల నాయకులకు స్వాగతం పలుకుతున్నామని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ పిలుపునిచ్చారు.