
పయనించే సూర్యుడు కడప డిస్ట్రిక్ట్ జూన్ 9 టి సుండుపల్లె మండలం ; విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (గుట్ట బాబు) తన ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయమని పేర్కొన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు సహాయక చర్యలను వేగవంతంగా చేపట్టడం అభినందనీయమన్నారు.భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, కార్మికుల ప్రాణ భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను కోరారు.– గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (గుట్ట బాబు)టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్