పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవర్గం ఇన్చార్జ్ వడ్ల శ్రీనివాస్ 19 తేదీ మార్చి
తమ వృత్తి నైపుణ్యంతో మిగితా అన్ని కులాలకు సేవలు చేసిన విశ్వకర్మలు నేడు చేతిలో పనులు చాలా దుర్భర జీవితాలు గడుపుతున్నారని,కార్పొరేట్,పెట్టుబడిదారీ శక్తులు వల్ల చేతి వృత్తులు చేసుకునే విశ్వకర్మలకు సరైన పని లేకుండా పోయింది,ఫలితంగా ఆ కుటుంబాలు ఆర్థికంగా,సామాజికంగా వెనుకబాటుగు గురయ్యాయని మండలిలో మల్లన్న ప్రస్తావించారు.గత ప్రభుత్వాలు ఏవి కూడా విశ్వకర్మల సమస్యలను పట్టించుకోలేదని కనీసం ఈ ప్రభుత్వం అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం వారి కోసం ప్రత్యేక చొరవ తీసుకొని ఎక్కడైతే ఇనాం భూములు ఉన్నాయో అక్కడ వారికి భూములు కేటాయించి వారికి షాప్స్ పెట్టుకునే విధంగా కృషి చేయాలని అలాగే ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించడంతో పాటు రైతు భీమా తరహాలో విశ్వకర్మ భీమా లాంటిది కూడా అమలు చేయాలని విశ్వకర్మల తరుపున మండలిలో కోరారు