పయనించే సూర్యుడు అక్టోబర్ 16,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ప్రధాని నరేంద్ర మోదీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిన అభిరుచి మధు.
మహానేతల కు దక్కని అవకాశం అభిరుచి మధు కు దక్కింది.
జన్మ ,జన్మలకు దక్కని గౌరవం లభించింది.
ప్రధాని మోదీ పర్యటన సూపర్ సక్సెస్.
ప్రధాని చేతుల మీదుగా 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
…రాష్ట్ర అభివృద్ధి,ఉద్యోగ, వ్యాపారాల కు పెద్దపీట. రాయలసీమ రత్నాల సీమ అని,దేశంలో,రాష్ట్రంలో ఎందరో నేతలు పదవులు పొందుతున్న రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లో విఫలం అయ్యారు.రాయలసీమ ను బాగుచేసి నాధుడే కరువైన పరిస్థితుల్లో ఆపద్భాదవుడిలా పిలవని దైవంలా విశ్వగురువు ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో రాయలసీమ రత్నాల సీమగా మారడం తధ్యమనిపిస్తుంది.రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి 13,430 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడం ఉమ్మడి జిల్లాల ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు.ప్రపంచ దేశాల నేతలు ప్రధాని తో కలవాలని తహ ,తహ లాడుతారు.ప్రధాని దర్శన భాగ్యం దగ్గరి నుంచి లభించాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు. బిజెపి పార్టీలో సామే కార్య కర్తగా చేరి అకుంఠత దీక్షతో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు కు గౌరవం దక్కింది.ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన లో భాగంగా హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే ప్రధాని కి నంద్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు అభివాదం చేయడంతో ప్రధాని అభివాదం చేయడం విశేషం.మహా ,మహా నేతలకు లభించని గౌరవం అభిరుచి మధుకు దక్కింది.ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు కొందరికే అనుమతి ఉన్నా ఆ కొద్ది మందిలో విశ్వగురువు అభిరుచి మధు కు దక్కడం ఆయన ఈ జన్మకు చేసుకున్న అదృష్టమే.జన్మ,జన్మ లకు దక్కని గౌరవం అభిరుచి మధు కు దక్కడం బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఖరారు కావడంతో గత 15 రోజుల నుంచి అభిరుచి మధు శ్రీశైలం,కర్నూలు,నంద్యాల ప్రాంతాల్లో కలియ తిరుగుతూ పర్యట సక్సెస్ చేసేందుకు కృషిచేశారు.అనుకున్న సమయం వచ్చింది గురువారం శ్రీశైలం పర్యటనకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హెలిప్యాడ్ కు చేరుకున్నారు.ప్రధాని వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ వెంట వచ్చారు.ప్రధానిని కలిసే కొద్ది మందిలో అభిరుచి మధు స్థానం దక్కించుకోవడం ప్రధాని వద్ద గుర్తింపుతో అభివాదం చేయడంతో అందరి దృష్టి అభిరుచి మధు వైపు వెళ్ళింది.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నీ కలిసే అదృష్టం దైవ నిర్ణయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.పార్టీకి అంకితమైన వారికి బిజెపి పార్టీ ఎంత గుర్తింపు ఇస్తుందో అర్థం అయిందని అన్నారు.జన్మ,జన్మ లకు దక్కని గౌరవం దక్కిందన్నారు.రాయలసీమ అభివృద్ధికి ఎవరు పట్టించుకొని సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ 13,430 కోట్ల అభివృద్ధి పనులకు,శంకుస్థాపనల ప్రారంభోత్సవం చేయడం అదృష్టమన్నారు.2,880 కోట్లతో కర్నూలు 3 పూలింగ్ స్టేషన్ ను అనుసంధానించేలా ఏర్పాటు చేసిన ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన,రూ 4,920 కోట్లతో ఓర్వకల్ కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులు,రెండు కారిడార్లలో సుమారు రూ 21 వేల కోట్ల పెట్టుబడులు,వీటి ద్వారా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు,రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ కారిడార్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రూ.960 కోట్లతో సబ్బవరం..షీలా నగర్ రహదారికి శంకుస్థాపన,రూ.1,140 కోట్లతో పీలేరు, కాలురూ నాలుగు వరసల రహదారి విస్తరణ,గుడివాడ,న్యూ జండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు శంకుస్థాపనతో రాష్ట్రం అభివృద్దిశలో పయనిస్తుందన్నారు.రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పి.వి. ఎన్.మాధవ్ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడానికి ఇదొక నిదర్శనం అన్నారు.గత 15 రోజుల నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వస్తున్న సందర్భంగా నంద్యాల లోని వివిధ ప్రాంతాలనుంచి బిజెపి శ్రేణులు 10 వేల మంది జిల్లా వ్యాప్తంగా లక్ష మంది ప్రధాని సభకు బయలు దేరారన్నారూ.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా,బోజన వసతి కల్పించారన్నారు.కూటమి నాయకులు అందరూ కలసికట్టుగా ప్రధాని మోదీ కి ఘనస్వాగతం పలికారన్నారు.కర్నూలు సమీపంలో జరిగే ప్రధాని ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారన్నారు.ప్రజలు ఊహించని వారాలు అశేష జన వాహిని మధ్య ప్రకటిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.ప్రధాని రాకతో బిజెపి పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.