
పయ నించే సూర్యుడు జూన్ 11 ముమ్మిడివరం ప్రతినిధ కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విప్పర్తి సత్యనారాయణకు పదోన్నతి లభించింది. ఇకపై ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా వెళ్ళనున్నారు. సుదీర్ఘ కాలం పాటు కాట్రేనికోన ఏఎస్ఐ గా పనిచేసి ప్రజల మన్నన పొందారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో నీతి,నిజాయితీగా పనిచేసి ప్రజలు మన్నలను పొందిన కాట్రేనికోన ఎస్ ఎస్ ఐ విప్పర్తి సత్యనారాయణ ఎస్ ఐ గా పదోన్నతి పొందారు. భట్నవిల్లి గ్రామానికి చెందిన విప్పర్తి సత్యనారాయణ చిన్నతనం నుండి కష్టపడి చదువుకుని, పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా ఎంచుకుని అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. సత్యనారాయణ పనితిరును,నిబద్దతతను మెచ్చిన పోలీస్ ఉన్నతధికారులు ఎస్ ఐ గా ప్రమోషన్ చేయడంపట్ల భట్నవిల్లి గ్రామస్తులు,పోలీస్ సిబ్బంది,హర్షం వ్యక్తం చేశారు.