పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
తాను ఎంపీ కొడుకునని, న్యూరో సర్జన్నని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు గా గుర్తించారు. ఇతను డా. విక్రాంత్ రెడ్డి అనే నకిలీ పేరుతో ఈ మోసాలు చేస్తున్నాడు.కేపీహెచ్బీలోని సితార ఉమెన్స్ పీజీ హాస్టల్ నడుపుతున్న ఒక మహిళను నిందితుడు మోసం చేశాడు.తన బంధువులు, జూనియర్లను హాస్టల్లో చేర్పించే నెపంతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.తాను జూబ్లీహిల్స్లో జ్యువెలరీ షాపు నడుపుతున్నానని నమ్మించి, ఆమె బంగారు గొలుసును రీమోడలింగ్ చేస్తానని తీసుకున్నాడు.రీమోడలింగ్ కోసం మరింత బంగారం అవసరమని చెప్పి, ఆమె నుంచి ఆన్లైన్లో యాబై ఐదు వేల రూపాయలు నగదు రూపంలో నలబై ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు. మొత్తం రూ. ఒక లక్షతో పాటు, నాలుగు తులాల బంగారు గొలుసు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు,
నిందితుడు వెంకటేశ్వర్లు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదయ్యాయి,
బాలానగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు, కూకట్పల్లి ఏసీపీ ఇ. రవి కిరణ్ రెడ్డి పర్యవేక్షణలో కేపీహెచ్బీ పోలీసులు ఆగస్టు 4, 2025న జేఎన్టీయూహెచ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేయనున్నట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు…