తొమ్మిదో తరగతి పిల్లలు పదో తరగతి పిల్లలకి ఇచ్చిన వీడ్కోలు
పయనించే సూర్యుడు మార్చి ఒకటి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా వార్తా విశేషణ.కోలాహలంగా వీడ్కోలు వేడుక గానుగపాడు (తిరువూరు రూరల్
శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గానుగ పాడులో పది విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఇచ్చిన వీడ్కోలు వేడుక కోలహలంగా సాగింది. ఆద్యంతం హుషారైన పాటలతో, కేరింతలతో కూడిన నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు. వేడుకను పురస్కరించుకొని ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి. ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులు సాయిరాం, రాజేంద్ర ప్రసాద్, రాం ప్రదీప్, రామారావు, సుదర్శన్, సాంబశివరావు, వెంకటేశ్వర్లు, రాము, హరీష్ తదితరులు పాల్గొన్నారు.