
పయనించే సూర్యుడు జూలై 2 ముమ్మిడివరం ప్రతినిధి*(కాట్రేనికోన)డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన శిలా విగ్రహ ప్రతిష్ట గణపతి ఆంజనేయ శిలా విగ్రహం ఆలయ శిఖరం జీవ ధ్వజస్తంభం, గరుడ బలిపీఠ పునః ప్రతిష్ట మహోత్సవం వేద మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా జరిగింది.ఈ మహోత్సవ కార్యక్రమంలో దత్తపీఠం 5వ పీఠాధిపతి శ్రీసాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆధ్యాత్మిక సందేశంతో కూడిన ప్రవచనం చేశారు ధర్మ ఆచరణ ఆలయ సంస్కృతి పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం భక్తి భావంతో జీవించాలని స్వామీజీ సూచించారు.ఆలయ ప్రతిష్ట కార్యక్రమం పట్ల భక్తుల్లో అపూర్వ ఉత్సాహం కనిపించింది. వందలాది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. పూర్ణాహుతి అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక మండలి సభ్యులు గోవ్వాల నాగరాజు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టా సూరిబాబు, రంబాల చిట్టిబాబు రంబాల సుభాష్ చంద్రబోస్ గుత్తుల భైరవ స్వామి తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.