
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యక్కంటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వృద్ధులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అనంతరం వృద్ధులకు బెడ్షీట్లు మరియు వాటర్ క్యాన్లను అందజేశారు. వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే వస్తువులను అందించడం జరిగింది.ఈ సందర్భంగా యక్కంటి వెంకటరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని, ఆయన వర్ధంతిని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా ఆయన ఆశయాలను స్మరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.పేదలు, వృద్ధులు, నిరుపేదలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని యక్కంటి వెంకటరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు, సిబ్బంది, సేవా కార్యక్రమాల నిర్వాహకులు మరియు పలువురు పాల్గొన్నారు.