ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జనవరి 10 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్)
ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తో కలిసి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ…. హిందూ సనాతన ధర్మం ప్రకారం వైకుంఠ ఏకాదశి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున సూర్య భగవానుడు ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటారని అన్నారు. ఈ రోజున మనం ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుందని అన్నారు. ఆ శ్రీమన్నారాయణ మూర్తి అనుగ్రహంతో పాటు భవ బంధనాలన్నీ కూడా తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి మనకు దర్శనమిస్తారని అన్నారు. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి అన్నారు ఆ స్వామివారి చల్లని చూపులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నాయకులు కుంకళ్ళ చెన్నయ్య, చెంది తిరుపతి రెడ్డి, చల్లా శ్రీకాంత్ రెడ్డి, అగ్గునూరి బస్వం అప్ప, తుపాకుల శేఖర్, నెహ్రూ నాయక్, రాయికల్ శ్రీనివాస్, మాధవులు, అంజి యాదవ్, బచ్చలి నరేష్, మాణిక్యం, లింగారెడ్డి గూడ అశోక్, నందిగామ శేఖర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు