పయనించే సూర్యుడు గాంధారి 14/05/25
గాంధారి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నారాయణ గిరి వద్ద వైభవంగా శివ భక్త మార్కండేయ ప్రతిష్టాపన ఉత్సవాలు రెండవ రోజు మంగళవారం కొనసాగించారు. సంఘ భవనం నుంచి మహిళ భక్తులు ఏకరూప దుస్తువులు ధరించి కలశాలను నెత్తిన బెట్టుకొని ఊరేగింపు గా మార్కండేయ ఆలయంలో చేరుకున్నారు. అనంతరం యాగ సంకల్పం, వేద మంత్ర పారాయణము లు శయ్య, ఫల, పుష్పం, ఫల, అది వాసములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం, భజన కార్యక్రమాలు చేపట్టారు. సంఘ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు