
పయనించే సూర్యుడు జనవరి 21, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
కూటమి ప్రభుత్వం సృస్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్దికి కాదని, అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని విమర్శించిన,మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సృస్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్దికి కాదని, అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని,మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశం ను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో సూరజ్ గ్రాండ్ ఫంక్షన్ హల్ లో నిర్వహించారు. సమావేశానికి పరిశీలకులుగా ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి , భూమా కిషోర్ రెడ్డి,మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, హాజరయ్యారు , వీరితో పాటు నియోజకవర్గ వైసిపి నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేయాలని, అలాగే కూటమి వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చి కూటమి నేతల అరాచకాలను ఎదుర్కోవాలని , ప్రతి కార్యకర్తకు పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తాము అన్నివేళలా అండగా ఉంటామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ నేతలు పిలుపు నిచ్చారు. సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో వైసిపి నేతలు,ధ్వజమెత్తారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ,వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేశారని , కానీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో నేతలు అరాచక పాలన చేస్తున్నారన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా పంపిణీలో కూడా రాజకీయాలు అంటగట్టి తీరని అన్యాయం చేస్తున్నారని , రాజకీయాల పేరు చెప్పుకొని రేషన్ డీలర్ , పొదుపు లీడర్ లను , అంగన్వాడీ పోస్టులను అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నేతలు ఒకటే గుర్తు పెట్టుకోవాలని భూమి గుండ్రంగా ఉంటుందని , అది రేపు మా వైపు రాకతప్పదని, తాము అధికారం చేతిలోకి వచ్చాక ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఆఖరికి మహిళల పై కూడ అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ,సంక్రాంతి పండుగ పేరుతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి గ్రామాల్లో అశాంతి రాజేసిన ఘనత కూటమి ప్రభుత్వం కే దక్కిందన్నారు. దారుణం ఏంటంటే మహిళా ఎస్. ఐ తన విధులు నిర్వహిస్తే ఆమె పైనే దాడులకు పాల్పడ్డం ఏంటని కూటమి పెద్దలను ప్రశ్నించారు. రాష్ట్ర హోమ్ మంత్రి , ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తూ కనీసం బాధ్యత లేకుండా ఉండడం ఏంటని ప్రశ్నించారు.ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉండేది కూటమి కాదు బంది పోట్ల రాజ్యం అని ప్రజల నుండి దోచుకుంటున్న వాళ్ళను బంది పోట్లనే అంటామన్నారు. ఈ ప్రభుత్వం లో ఏ పని కావాలన్న కమిషన్ ఇవ్వందె పనులు కావడం లేదన్నారు.న్యాయ శాఖ మంత్రి ఇలాకాలో న్యాయమే లేదని , మట్టి , ఇసుక , మద్యం ఇతర పనుల్లో ప్రజల నుండి అక్రమంగా దోచుకుంటున్నారే తప్ప ప్రజలకు మేలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు దేశం సుధాకర్ రెడ్డి, పి.పి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ సాయినాథ్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జివి రమణ, మున్సిపల్ చైర్మన్ మభూన్నీ సా, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బేక్యం రామసుబ్బారెడ్డి, వైసిపి నాయకులు ప్రహ్లాద రెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, డాక్టర్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టి వై శివయ్య, నంద్యాల జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనీల్ అమృతారాజ్,మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ పురుషోత్తమ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , తదితరులు పాల్గొన్నారు.

