

జయంతి వేడుకల్లో కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించిన…వైయస్ షర్మిల
జయంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని నివాళులు అర్పించిన
ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పరకాలఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని కడప జిల్లా ఇడుపులపాయలొ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల తనయ, గారాల పట్టి వైఎస్ షర్మిలమ్మ గారు వారి స్వగృహంలో ముందుగా కేక్ కట్ చేసి రాజశేఖర్ రెడ్డి గారి స్మృతి వనంలో ఘనంగా నివాళులు అర్పించి రాజశేఖర్ రెడ్డి గారి తో గడిపిన రోజులను నెమరు వేసుకున్నారుఈ యొక్క జయంతి వేడుకల్లో పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ గారు పాల్గొని కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసిన కార్యక్రమంలో పాల్గొని అనంతరం రాజశేఖర్ రెడ్డి గారికి వైయస్ షర్మిల అక్క గారితో ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందిఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజ్ రియంబర్స్ మెంట్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 60 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధుడికి వృద్యాప్య పెన్షన్ వికలాంగులకు వికలాంగుల పెన్షన్ అతి తక్కువ వయసులో భర్తను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న ఆడపడుచులకు ఒక అన్నగా అండగా ఉండి వితంతు పెన్షన్, రైతాంగానికి ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు ఎరువులు ఇచ్చే కార్యక్రమం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహా వ్యక్తి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు అని మల్లేశం గౌడ్ కొనియాడారు