పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సంజీవ రాయుడు ఆధ్వర్యంలో యాడికి ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అర్హత ఉండి పింఛన్లు పొందుతున్న కొంత మంది వికలాంగులకు పెన్షన్ అర్హత లేదంటూ పింఛన్లు తొలగించడం చాలా బాధాకరమని పెన్షన్ పై ఆధారపడి బతికే వికలాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మేము ఎలా బతకాలి అని కన్నీరు మున్నీరు అవుతున్నారు కావున ప్రభుత్వ అధికారులు మంచి మనసుతో ఒకటికి రెండుసార్లు వారి అర్హతను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ ఈవో నాగేశ్వర్ రెడ్డి కి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది అటు చెయ్యని పిమ్మట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అధికారులకు విన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు ఉపేంద్ర గౌడ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు శివ ప్రసాద్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చందన వెంకటరామిరెడ్డి, మనోహర్ రెడ్డి, రామాంజనేయులు,