
:పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 మక్తల్:ప్రభుత్వం తనకిచ్చిన 4 నెలల గౌరవ వేతనాన్ని ఎన్నో ఏళ్లుగా చెప్పులు కుట్టి జీవనం సాగిస్తున్న హరిజన సీతమ్మకు 7000 రూపాయలు అందించారు.ఎండనక వాననక రోజంతా రోడ్డుమీద కూర్చొని తన వృత్తిలో భాగంగా చెప్పులు రిపేర్ చేస్తూ ఎంత ఇస్తే అంతే తీసుకొని, ఒక సేవాభావంలా భావిస్తూ పనిచెయ్యడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆది గుర్తించి శైవి రెడ్డి తన మొదటి నెల వేతనం సీతమ్మకు కొంతైనా అండగా ఉంటుందని ఇవ్వడం జరిగింది.అలాగే మరో 12000 రూపాయల వేతనం స్కూల్ పిల్లలకు సేఫ్టీ కొరకు సీసీ కెమెరాలు కొనుగోలు కొరకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ mpps పాఠశాల హెచ్ఎం కి వేతనం అందించడం,భావి భారత పౌరులకు తన వంతు తోడ్పాటు తనకెంతో సంతోషం అందించిందని శైవి రెడ్డి తెలిపారు. మరో 10000 రూపాయల వేతనం పులిమామిడి ఆలయం దగ్గర మరుగుదొడ్డి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది.సమాజానికి ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలని చేతనైనంత సహాయం అందించాలని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తక్షణమే స్పందించి కనీస అవసరమైన నీరు పారిశుధ్యం విద్యుత్తు రోడ్లు డ్రైనేజీల వ్యవస్థలను పర్యవేక్షిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి.ని ఆదర్శంగా తీసుకొని ప్రజలలో కలిసిపోతానని తెలిపారు.
వచ్చిన 4 నెలల వేతనం పలు ఉపయోగాలకు వినియోగించడం జరుగుతుందని అన్నారు.