
బూడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్
శాస్త్ర స్కూల్ విద్యార్థులకు బెల్ టెస్ట్ నిర్వహించిన బుడోఖాన్ కరాటే క్లబ్ మాస్టర్
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫరూక్నగర్ ఎంఈఓ మనోహర్
( పయనించే సూర్యుడు నవంబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ లోని శాస్త్ర స్కూల్లో యాదవ్ బుడోఖాన్ బ్లాక్ బెల్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 39వ వైబికేసి ఐ గ్రేడింగ్ టెస్ట్ మరియు బెస్ట్ అవార్డు చైర్మన్ ఘనంగా నిర్వహించారు. శాస్త్ర స్కూల్ పాఠశాలలో కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులకు కరాటేల్లో ఉత్తమంగా రాణిస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి గ్రీన్ బెల్ట్ అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫరూక్నగర్ మండల విద్యాధికారి టీ మనోహర్ హాజరవ్వడం జరిగింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎంఈఓ సర్టిఫికెట్ మరియు బెల్ట్స్ అందజేయడం జరిగింది. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ… వ్యక్తిగత రక్షణ మరియు క్రమశిక్షణ అనేది కరాటే వల్ల నేర్చుకోవచ్చు అని చదువుతోపాటు కరాటే లో కూడా రాణించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్ర స్కూల్ ప్రధానోపాధ్యాయులు పావని యాదవ్ బుడోఖాన్ కరాటే డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ ఆర్గనైజర్ ఉత్తేజ్, గోపి, హర్షిక మాస్టర్ మరియు స్కూలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
