పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 6. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్పో లీసుల వాహన తనిఖీల్లో పేలుడు పదార్థాల లభ్యం
పోలీసుల వాహన తనిఖీల్లో పేలుడు పదార్థాలు లభ్యమైన సంఘటన ఇది. ఎస్సై రఫీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏన్కూర్ లోని జన్నారం క్రాస్ రోడ్ వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన కొరసం రమేష్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలైన జిలిటన్ స్టిక్ డిటోనేటర్లు తన ద్విచక్ర వాహనంలో పెట్టుకుని గార్ల ఒడ్డు నుండి నుండి ఏన్కూరు వస్తుండగా అదే సమయంలో జన్నారం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీలు పట్టుబడ్డాడు. దీంతో వాహనాన్ని తనిఖీ చేయగా తన ద్విచక్ర వాహనంలో పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ తరలించి విచారించగా కొరసం రమేష్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి తన గ్రామమైన కొత్త మేడేపల్లి లో తనకు గంగరాజు అనే వ్యక్తికి గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని గంగరాజు అనే వ్యక్తి ఆ గ్రామంలో పెద్దమనిషిగా చాలా ఇస్తూ అందరిని బెదిరిస్తున్నాడని దీంతో అతని ఎలాగైనా పోలీసుల కేసులు ఇరికించాలనే నెపంతో ఈ పేలుడు పదార్థాలు తీసుకొని వెళ్తున్నట్టు తెలిపాడు. గ్రామం వెళ్లి గంగరాజు ఇంట్లో పెట్టి ఎలాగైనా పోలీసులకు సమాచారం ఇచ్చి గంగరాజును పోలీసులకు పట్టించాలని పథకం వేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ పేలుడు పదార్థాలు తీసుకుని వెళుతుండగా పోలీసులకు దొరికినట్లు తెలిపారు. రమేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ రఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కొండయ్య, సిబ్బంది సైదా, రవి తదితరులు పాల్గొన్నారు