//పయనించు సూర్యుడు న్యూస్//నారాయణపేట జిల్లా ఇన్చార్జ్ వడ్ల శ్రీనివాస్ మార్చ్ 2 తేదీ : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే వ్యవసాయ కళాశాలను నారాయణ పేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.పేట జిల్లా విద్యారంగంలో పూర్తి గా వెనుకబడి పోయింది కావున జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్, డీఎడ్, బిఎడ్ ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ను ఏర్పాటు చేసి బోధన సిబ్బంది నియమించాలని అన్నారు. నారాయణపేట జిల్లాలోని ప్రతి నియోజక వర్గ కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా ప్రభుత్వ పీజీ కళాశాల,వెటర్నరీ కళాశాల, ఐటీఐ కళాశాలను కూడా ఏర్పాటు చేసి విద్య రంగంలో అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జల సాధన సమితి నాయకులు బాల కిష్టయ్య,రాఘవేంద్ర,తిరుపతి, తాయప్ప,రఘు పాల్గొన్నారు.