మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
మొగలిగిద్ద గ్రామంలో మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాపును ప్రారంభించిన వై. అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
వ్యాపార రంగంలో రాణించాలన్న, ఆర్థికంగా ఎదగాలను నాణ్యత ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం గ్రామానికి చెందిన శివకుమార్ నూతనంగా నెలకొల్పిన మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంతోపాటు, నిత్య అందుబాటులో ఉండాలని సూచించారు. పోటీ ప్రపంచంలో ఆర్థికంగా ఎదగాలంటే ఇప్పటికప్పుడు మార్కెట్ డిమాండ్ అంచనా వేస్తూ, వినియోదారులకు నాణ్యమైన వస్తువులను అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం పట్టణాలకు దీటుగా ఎలక్ట్రికల్ షాప్ లను నిర్వహించడం అభినందనీయమని, స్వయం ఉపాధితో రాణించాలనే దృఢసంకల్పంతో వ్యాపార కేంద్రాలను నెలకొల్పడం సంతోషకరమన్నారు. ఇందులో భాగంగానే షాప్ నిర్వాహకులు శివ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, నటరాజ్, నాయకులు బుగ్గకృష్ణ, బాలరాజు, మహేష్, రాము, శివ తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.