
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ లోని కోదండ రామాలయం, దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు అయిన మంగళవారం అమ్మవారు దుర్గామాత గా దర్శనమిచ్చారు. దుర్గాదేవి అలంకరణతో అమ్మవారిని అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏన్కూర్ ఎస్సై ఎన్ సంధ్య దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మహా అన్నదానం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.