ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సూర్యుడు ప్రతినిధి కంచికచర్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు సూచనలతో పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమా వెంకట్రావు( బాబు) పేర్కొన్నారు.ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమా బాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో కంచికచర్ల పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోక ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా కంచికచర్ల పట్టణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబులకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమా వెంకట్రావు (బాబు) ధన్యవాదాలు తెలియజేశారు.