రుద్రూర్, ఏప్రిల్ 04 (పయనించె సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
హిందువులు సామరస్యంగా శ్రీరామనవమి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో వివిధ గ్రామాల్లోని రామాలయ ఆలయ కమిటీ సభ్యులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. ఈనెల 6వ తేదీన నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలను అ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ ఐ రాజు, వర్ని ఎస్సై మహేష్, హెడ్ కానిస్టేబుల్ సురేష్, పోలీస్ బృందం, రామాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.