పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 18:- రిపోర్టర్( కే శివకృష్ణ )
ఏపీ ఆరోగ్యమిత్ర & కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ వారి ఆధ్వర్యంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యశాలలో ఆరోగ్యశ్రీ సిబ్బంది ఈ రోజు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తపరచడం జరిగింది. ఈ సందర్భంగా వారు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్యసేవ ఫీల్డ్ సిబ్బందికి కేడర్ ఇస్తూ, ప్రభుత్వ కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తూ మినిమమ్ టైమ్ స్కేల్ ఇన్వాల్సిందిగా కోరుచున్నాము అని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి కి స్పందనలో వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు రాజు మాట్లాడుతూ గత 17 సంవత్సరములుగా డా॥ఎన్.టి.ఆర్.వైద్య సేవా పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ లెవల్ సిబ్బందికి మినిమమ్ స్కేల్, కేడర్, ఉద్యోగ భద్రత అమలుకాలేదు. ఈ విషయమై అధికారులను చాలాసార్లు కలిసాము. కాని ఇప్పటివరకు ఏమి జరగలేదు. అందువలన ఈ నెల మార్చి 10, 17, 24 తేదీలలో శాంతియుత నిరసన తెలియజేయాలని కార్యాచరణ రూపొందించుకున్నాము. ఈ నెల 10వ తేదీన చేయవలసిన కార్యక్రమాన్ని ట్రస్టు సి.ఇ.ఓ పిలుపుమేరకు వాయిదా వేసి ది.12-03-2025న చర్చలో పాల్గొన్నాము. సి.ఇ.ఓ త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినారు. కాని సి.ఇ.ఓ మా సమస్యలపై ఎటువంటి నిర్ణయము తెలుపని కారణంగా ది.17-03-2025న శాంతియుత నిరసన తెలియజేస్తూ విధులనుండి బహిష్కరిస్తున్నాము అని అన్నారు. నాగిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రధాన అజెండా ను తెలియజేశారు అవి 1.ఎన్.టి.ఆర్. వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది యొక్క 17 సంవత్సరాల సర్వీసుని పరిగణలోకి తీసుకొని ఫీల్డ్ సిబ్బంది అందరినీ ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ, వైద్య మిత్రాలకు డి.పి.ఓ.కేడర్, ఆఫీస్ అసోసియేట్ మరియు టీమ్ లీడర్స్ సమాన అర్హతకలిగిన కేడర్, జిల్లా మేనేజర్లకు డి.వై.ఇ.ఓ. కేడర్ అమలు చేసి కనీత వేతనం ఇవ్వాలి.2. డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్యసేవ ఉద్యోగి చనిపోయిన కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్ గ్రేషియో. రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజ్ కల్పించాలి.3. డాక్టర్ ఎన్.టి.ఆర్. సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు కల్పించాలని కోరుచున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు.