
పయనించే సూర్యుడు అక్టోబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
శాంతి రామ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జేఎన్టీయూప్ నుంచి పీహెచ్డ్ పట్టాలు అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల పరిశోధకులు ఎన్. రామా దేవి, జె. డేవిడ్ సుకీర్తి, తమ వైవా%%వోస్ను విజయవంతంగా పూర్తి చేసి, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, అనంతపురం నుండి డాక్టరేట్ డిగ్రీలు అందుకున్నారన్నారు. ఈ ఇద్దరు పరిశోధకులు ఈ ప్రయాణంలో సి ఎస్ ఈ విభాగానికి చెందిన సహ పరిశోధన పర్యవేక్షకులు శోభ బొందు, ఏపీ శివకుమార్ కీలకమైన శాస్త్రీయ సూచనలు, సకాలంలో మార్గనిర్దేశం మరియు సాంకేతిక సహకారం అందించారన్నారు. వారి ప్రోత్సాహం, నైపుణ్యం, నిరంతరమైన విద్యా మద్దతు పరిశోధన విజయవంతంగా పూర్తి కావడంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. రామా దేవి లోడు బ్యాలెన్స్డ్ మెటహరిస్టిక్ హైడ్రిక్ క్లస్టర్ ఫర్ ప్రోలింగింగ్ లైఫ్ టైం ఇన్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అనే అంశంపై పరిశోధన చేసినట్టు తెలిపారు. వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ జీవకాలాన్ని పెంచడంలో అవి మరింత సమర్థవంతంగా పనిచేయడంలో సహాయపడే విధానాలను ప్రతిపాదిస్తుంది. ఈ పరిశోధన స్మార్ట్ సిటీస్, పర్యావరణ పరిశీలన, రక్షణ రంగం వంటి విస్తృత రంగాల్లో సుదీర్ఘకాలిక సెన్సార్ వ్యవస్థల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. డేవిడ్ సుకీర్తి చేసిన అడాప్టివ్ స్కేలబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్ టార్గెట్ ట్రాకింగ్ మోడల్స్ న్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అనే అంశంపై పరిశోధన చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన శక్తి వినియోగాన్ని తగ్గిస్తూ, లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించే ఆధునిక నమూనాలను సూచిస్తుంది. ఇది భద్రత, పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, ‰x% మరియు సెన్సార్ ఆధారిత ఆటోమేషన్ వ్యవస్థల్లో విస్తృత వినియోగానికి అవకాశం కల్పిస్తుంది. పరిశోధన రంగంలో తమ అంకితభావం, కృషితో విశిష్ట ఫలితాలు సాధించిన ఈ ఇద్దరు పరిశోధకులను ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం, అధ్యాపక బృందం అభినందించింది. వారి పరిశోధనలు భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.