పయనించే సూర్యుడు జూలై 18 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట పట్టణం లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవికి ఆషాడ మాసం సందర్భముగా శాకాంబరీ అలంకారం చేశారు. ఆలయం లోని గర్భాలయం ముందు రకరకాల కూరగాయలతో, పండ్లతో పందిళ్లు వేసి అందంగా అలంకరించారు. ఆలయం లోని అమ్మణ్ణి మూలవిరాట్ కు కూడా రకరకాల కూరగాయలతో, పండ్లుతో ఆకర్షణీయంగా అలంకరించి ముందుగా అమ్మణ్ణికి వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు . పెద్ద సంఖ్యలో భక్తులు శాకాంబరీ అలంకారం లో ఉన్న చెంగాళమ్మ ను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ,పార్థసారధి దంపతులు అమ్మణ్ణికి పట్టు వస్త్రాలను సమర్పించారు, ఎమ్మెల్యే దంపతులకు ఆలయ సహాయక కమీషనర్ ప్రసన్న లక్ష్మి ఆలయం వద్ద స్వాగతం పలికారు . పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే దంపతులకు EO చేతులు మీదుగా ఆలయ మర్యాదలు అందించారు. ఈ పూజల్లో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షులు ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.అలాగే ఈ వేడుకల్లో భాగంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి భక్త బృందం మరియు సేవ సమితి మహిళలు అమ్మణ్ణికి సారెను సమర్పించడం జరిగింది.