పయనించే సూర్యుడు మార్చి 3 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని గీతాంజలి ఒలంపియా డ్ హై స్కూల్ చైర్మన్ పుట్టి శ్రీనివాస్ రావు వారు మాట్లాడుతూ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని వివేకానంద నగర్ లో గల గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు చదువుతోపాటు వారి మనోభావాలకు అనుగుణంగా వారిలోని నైపుణ్యతను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు.వారి విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాకుండా దేశ ప్రతిష్టను పెంచే విధంగా తయారు చేస్తున్నామన్నారు. ఇతర విద్య సంస్థల నుండి సుమారు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు 300 కు పైగా నమూనా లను తయారు చేశారు.కాలుష్యం రవాణా నీటిపారుదల వ్యవసాయం వైద్యం పట్టానాభివృద్ధి అంశాలపై తయారుచేసిన నమూనాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యాజమాన్యం ఉపాధ్యాయ బృందం గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ ప్రిన్సిపల్ పసుపులేటి ఉమా వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు