
పయనించే సూర్యుడు జనవరి 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
"5 మంది అరెస్టు, 6 కిలోల గంజాయి స్వాధీనం."
నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షెరాన్ IPS, Addl SP శ్రీ యుగంధర్ బాబు, ఆదేశాల మేరకు , ఆళ్లగడ్డ DSP శ్రీ కె.ప్రమోద్, సూచన మేరకు శిరివెళ్ల సర్కిల్ CI శ్రీ రాము,ఆద్వర్యంలో, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది.ఈ క్రమంలో, శిరివెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ జయప్ప కి అందిన ముందస్తు సమాచారం ప్రకారం, శిరివెళ్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి (A1) వద్దకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసు (A2) గంజాయి తీసుకొని బోయిలకుంట్ల గ్రామ సమీపంలో ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు వస్తాడని తెలిసింది.దీంతో 30.01.2026 తేదీ సాయంత్రం 4.00 గంటల సమయంలో, శిరివెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ జయప్ప మరియు వారి సిబ్బంది కలిసి బోయిలకుంట్ల గ్రామ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు వెళ్లారు. అక్కడ ఐదుగురు వ్యక్తులు గంజాయిని ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా మాట్లాడుకుంటూ ఉండగా, వారిని పట్టుకొని తనిఖీ చేయగా,జింకల మద్దిలేటి (A1) వద్ద నుండి – 2 కిలోల గంజాయి,కోడూరు శ్రీనివాసు (A2) వద్ద నుండి – 1 కిలో గంజాయి, దండబోయిన గురుస్వామి (A3) వద్ద నుండి – 1 కిలో గంజాయి, షేక్ అబ్దుల్ నబీ (A4) వద్ద నుండి – 1 కిలో గంజాయి, మొఘల్ గఫార్ భేగ్ (A5) వద్ద నుండి – 1 కిలో గంజాయి,కలిపి మొత్తం 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, అదే రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేయడమైంది.విచారణలో A1 జింకల మద్దిలేటి పై ఇప్పటికే కృష్ణా జిల్లా అవనిగడ్డ పి.ఎస్., ఢిల్లీ, నంద్యాల జిల్లా మహానంది పి.ఎస్., నంద్యాల తాలూకా యూపీఎస్లలో కలిపి మొత్తం 4 గంజాయి కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. ఇతనిపై రోడీ షీట్ మరియు సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. గతంలో ఇతడు ఒరిస్సా నుండి గంజాయి తెచ్చేవాడు. ఆ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం అదే పరిచయంతో, కోడూరు శ్రీనివాసు ద్వారా ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది.ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీ కె. ప్రమోద్ , ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కు పాల్పడిన వారిపై , రౌడీ షీటర్లు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.