పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర జనవరి 31:- అనంతపురం శిల్పారామం ( నేషనల్ పార్క్)వేసవిలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తునందువల్ల అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలి అని.శిల్పారామం ఏవో కృష్ణకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశించారు.వేసవి సెలవుల్లో పిల్లలకు ఆహ్లాదం పంచేలా అక్కడ వాతావరణం ఉండాలి ఆయన సూచించారు.తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యాలు ఉండాలి అని అన్నారు. నగర ప్రజలకు ఇది పిక్నిక్ స్పాట్ గా ఉండాలి.ఎలాంటి అవసరాలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.