గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి.గద్వాల్ విజయలక్ష్మి గారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై నమ్మకంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ అనేక కాలనీ/బస్తి అసోసియేషన్ సభ్యులు తమ గోడును విన్నవించుకుంటున్నారు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు పరిశీలించిన నగర్ మేయర్ శ్రీమతి.గద్వాల్ విజయలక్ష్మి గారు,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్/శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు మరియు హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.పూజిత గౌడ్ గారు,జోనల్ కమీషనర్ శ్రీ.ఉపేందర్ రెడ్డి గారు,డిప్యూటీ కమిషనర్ శ్రీ.మోహన్ రెడ్డి గారు,ఇతర అధికారులు పాల్గొన్నారు..
*కాంగ్రెస్ పార్టీకి జీ.హెచ్.ఎం.సి అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై పక్క ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని,హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో పెండింగులో ఉన్న పనులు సంబంధిత అధికారులతో కలిసి పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు..
నిత్యం రద్దీగా ఉండే మంజీర రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని,ఇప్పటికే వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని,ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని నగర్ మేయర్ గారికి కోరారు..
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు,శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు,ప్రజలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..