పయనించే సూర్యుడు జనవరి 14హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం అయ్యప్ప స్వామి తిరువాభరణ శోభయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శోభయాత్రలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పాల్గొని అయ్యప్ప స్వాములతో కలిసి స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత సింగిల్ విండో చైర్మన్ శివయ్య, తదితరులు పాల్గొన్నారు.