
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : శ్రావణ సోమవారం సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు శివాలయాల్లో పూజలు నిర్వహించారు. బైంసా మండలంలోని సుంక్లి గ్రామ నాగదేవత ఆలయంలో పూజలు చేశారు. అదేవిధంగా సూర్యాపూర్ గ్రామ స్వాగత తోరణాన్ని ప్రారంభించి, శివాలయంలో పూజలు చేశారు. అనంతరం ఓలా గ్రామంలో శివాలయంలో ప్రత్యేక పూజలుచేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరున్ని కోరుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.కార్యక్రమం లో ఆయా గ్రామాల సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు