
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య ఆధ్వర్యంలో
( పయనించే సూర్యుడు జనవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డ్ లో శ్రీనగర్ కాలనీలోని గన్నోజు యాదగిరి ఇంటి నుండి గన్నోజు రాజలింగం వరకు, శ్యాంసుందర్ ఇంటి నుండి ఖలీమ్ ఇంటి వరకు రెండు సిమెంట్ రోడ్డులకు మంగళవారం రోజు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక వార్డులలో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జమాల్ పూర్ చందూలాల్,బుచ్చిరెడ్డి,ఓం ప్రకాష్, షాద్నగర్ నియోజకవర్గం బీసీ జనసేన అధ్యక్షుడు కత్తి చంద్రశేఖర అప్ప, తంగడపల్లి శంకర్, చౌలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మార్కాపురం రవి, శ్రీనివాస్, మార్కాపురం మురళి, వేణు, యాదయ్య, మేకల వెంకటేష్,నవీన్ రెడ్డి ,శ్యామ్ సుందర్,జమాల్ పూర్ శివాజీ, జనార్దన్ గౌడ్, శ్రీనివాస్, మహేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు..