పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సంగం పోలీస్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ ఐపీఎస్ , ఆత్మకూరు డివిజనల్ డిఎస్పి కే.వేణుగోపాల్ ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న గ్రామాలలో సీఐ వేమారెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగను ఉద్దేశించి పలు సూచనలు చేయడమైనది.ఈనెల ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా పలు గ్రామాలలో నిర్వహించే ఉత్సవాల సందర్భంగా అనుమతులు లేకుండా ఈవెంట్స్ గాని అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు వంటి పలు కార్యక్రమాలను నిర్వహించరాదని సూచన. ఉత్సవాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు,డైమండ్ డబ్బా,అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాము.పవిత్రమైన శ్రీరామనవమి పండుగను వివాదాలు లేకుండా జరుపుకోవాలని సంగం సర్కిల్ సీఐ. కె .వేమారెడ్డి తెలిపారు