పయనించే సూర్యుడు తేదీ 15 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్‌ఛార్జి బోయ కిష్టన్న.
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నందు త్వరలో జరగబోయే కేటీ దొడ్డి మండల పరిధిలోని పాగుంట వెంకటాపురం గ్రామంలో శ్రీశ్రీ బాగుంటా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర పోస్టర్లను ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ముందుగా ఈవో గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ బాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు దేవలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో పళ్ళు మండల మాజీ ఎంపీపీలు హాజరయ్యారు