పయనించే సూర్యుడు ,జనవరి 30,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది కళ్యాణ తలంబ్రాలను భక్తులు భక్తి శ్రద్ధలతో తమ చేతి గోటితో వడ్లను వలచి తలంబ్రాలుగా తయారుచేస్తారు,అలాంటి మహత్తర కార్యాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,బూర్గంపాడు మండలం ,సారపాక లోని శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారక సాయి బాబా వారి మందిరంలో ధర్మ జాగరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి ఆధ్వర్యంలో పుష్కర సాయి బాబా మందిర కమిటీ సౌజన్యంతో గురువారం గోటి తలంబ్రాలు తయారు చేయడం జరిగినది, ఉదయం బాబా వారికి ప్రత్యేక పూజలు అనంతరం గోటి తలంబ్రాలు కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు గోటి తలంబ్రాలు తయారు చేయడం ఎంతో అదృష్టం, అలాంటి అదృష్టం మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు,ఎంతో నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో గోటితో వడ్లను వలచి తలంబ్రాలుగా తయారు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ రామయ్య తండ్రి కళ్యాణంనకు మా ఆలయంలో గోటి తలంబ్రాలు తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు, మున్ముందు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయనున్నామన్నారు, ఇలాంటి అవకాశం కల్పించిన ధర్మ జాగరణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు .ఈ కార్యక్రమంలో మందడి హనుమంతరావు, సింగమనేని విజయభాస్కరరావు, ఇండ్ల శ్రీనివాసరావు ,అక్కర భాస్కరాచారి ,కొత్తపల్లి సత్యనారాయణ ,కృష్ణారావు, నాగేశ్వరరావు ,రామకృష్ణ, రామ్మోహన్ రెడ్డి ,రమణ మూర్తి ,
రాంబాబు భద్రాచలం , మేడూరి వెంకట సుబ్రహ్మణ్యం, మరియు భక్తులు మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు