
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కాలింగినది ఒడ్డున వెలిసి ఉన్న అమ్మ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి తల్లి గుడి షాపులకు గాను 12. 2 . 26 బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానమునకు చెందిన వివిధ 8 లైసెన్సు హక్కులు 2026 -27 సం"నకు 1 సంవత్సర కాలమునకు యిచ్చుటకు గాను దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో బహిరంగ వేలం పాట నిర్వహించుట జరిగినది. బహిరంగ వేలం నందు భక్తులు కానుకలుగా సమర్పించిన చీరలు, రవికలు సేకరించుకోను హక్కు రూ.42,50,000/-లు పాదరక్షలు భద్రపరచు స్టాండ్ నిర్వహించుకొను హక్కునకు రూ.3,51,000/-లకు మరియు పాత్ర సామాన్లు, షామియానాలు సప్లై కళ్యాణమండపంతో కలిపి హక్కునకు రూ.12,40,000/-లకు హెచ్చు పాటపాడినారు. మిగిలి 5 హక్కులు వాయిదా వేయుట జరిగినది. ఈ కార్యక్రమములో గూడూరు, దేవాదాయ శాఖ, ఇన్స్పెక్టర్ M.సుధీర్ బాబు పర్యవేక్షణలో, సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి బి. ప్రసన్నలక్ష్మీచే నిర్వహించుట జరిగినది.
