పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 1:-రిపోర్టర్ (కే శివకృష్ణ) ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని కర్లపాలెం ఎంపీడీవో అద్దూరి నివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ భార్గవి హై స్కూల్ నందు శుక్రవారం జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలలో శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేటువంటి విధంగా శ్రీ భార్గవి యాజమాన్యం విద్యార్థుల చేత ప్రాజెక్టులను చిన్న వయసులోనే తయారు చేయించటం అభినందనీయమన్నారు. విద్యార్థులు తాము చేసిన ప్రాజెక్టులను చక్కగా వివరించారు. అనంతరం ప్రాజెక్టులను తయారు చేయడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రెటరీ కరస్పాండెంట్ పివి సురేష్ ప్రిన్సిపాల్ లక్ష్మి,సైన్స్ ఉపాధ్యాయులు పి వేణు, లతా, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సాహితి , కుమారి, సునీత,రిజ్వానా, దివ్య, ప్రసన్న, చక్రవర్తి, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.