
పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల: నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వేదికగా శ్రీ మహానందిశ్వర వడ్డే, వడియరాజుల అన్న సత్రం 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్,టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిలుగా హాజరై ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మహానంది వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం వడ్డే మరియు వడియరాజుల సంఘం ఆధ్వర్యంలో అన్న సత్రాన్ని నిర్వహించడం, సామాజిక సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. కుల సంఘాలు ఐక్యంగా ఉంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు గోగుల హరిపోతులూరు, అధ్యక్షులు వేముల చిన్న వెంకటస్వామి, ప్రచార కార్యదర్శి వడ్డె జనార్ధన్, అధ్యక్షులు పల్లె చిన్న వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు మంజుల సుబ్బరాయుడు, హరి, సంపంగి జయకృష్ణ, కుంచపు వెంకట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పల్లెపు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
