
పయనించే సూర్యుడు జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భీష్మ ఏకాదశి పురస్కరించుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి వార్లకు ది 28-1-2026 వతేది నుండి ది 2-2-2026 వతేది వరకూ పంచ దినదీక్షతో శైవాగమోక్తముగా శ్రీ స్వామివారి అనువంశిక ధర్మకర్తలైన రాజమండ్రి వాస్తవ్యులు మహారాజశ్రీ మన్యం కనకయ్య జమీందారు వారి కుమారులు మహారాజశ్రీ మన్యం సంతోష్ ఫణి కుమార్ గారి దంపతుల యాజమాన్యంలో శైవాగమ పండితులైన బ్రహ్మశ్రీ పూజ్యం గణేష్ కుమార్, కిరణకుమార్ శర్మల బ్రహ్మత్వంలో అర్చకులు మానేపల్లి శివకుమార్ శర్మ గారి సారధ్యంలో శైవాగమపండిత టీటీడీ వార్షిక సత్కార పండితులైన బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు శివాచార్య వారి వ్యాఖ్యానం తో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పర్యవేక్షణలో యానాం ప్రభుత్వ పరిపాలనాధికారుల సమక్షంలో, అశేష భక్త జనవాహిని సమక్షంలో నిన్నటి రోజున అంకురారోపణ, ధ్వజారోహణాధి దీక్షా కార్యక్రమాలు పూర్తిచేసి రెండవ రోజు భీష్మ ఏకాదశి మహా పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించిరి… కళ్యాణ అనంతరం అనువంశిక కళ్యాణ ధర్మకర్తలైన మన్యం వారు కళ్యాణంలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ పసుపు కుంకుమలను అందజేసిరి… ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ దేవస్థానం వారు ముత్యాల తలంబ్రాలని అందించిరి.. కళ్యాణ అనంతరం మన్యం వారు మరియు యానాం భక్తులు కలిసి బ్రహ్మాండమైన అన్న సమారాధన నిర్వహించిరి…

