యజ్ఞం నిర్వహిస్తున్న దృశ్యం.. భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బసవలింగ అవధూత మహారాజ్..
రుద్రూర్, మార్చ్ 11 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సహిత విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య మేళన, రక్షాబంధనము, అఖండ దీపారాధన, గోపూజ, దేవతలకు కుంబాభిషేకము, మండపారాధన, కళ్యాణము, శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణము, హవనము, బలి పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పలువురు దంపద జంటలు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూత మహారాజ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, భక్తితోనే ముక్తి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని భగవంతునికి కేటాయించాలని సూచించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, నారాయణ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర, వీరేశం, గెంటల సాయిలు, పత్తి లక్ష్మణ్, మోత్కూరి లలేందర్, వడ్ల గంగాధర్, అడప సాయిలు, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.