
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి30 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి నందు వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరిలో జరగనున్న బ్రహ్మోత్సవాల గురించి చర్చించుటకు శుక్రవారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ శ్రీ జె.సి.ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు, ఆయకట్టుదారులు,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలతో కలిసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగినది.మున్సిపల్ చైర్మన్ శ్రీ. జె.సి.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటినుండి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని తెలిపారు…..

