పయనించె సూర్యుడు జనవరి 11 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్బేరు మున్సిపాలిటీ:
చెలిమిల్ల,కిష్టారెడ్డిపేట
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ముక్కోటి ఏకాదశిగా పిలువ బడేటువంటి విశేషమైనటువంటి శుక్రవారం రోజున పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిల్ల కిష్టారెడ్డిపేటలో గల కొలువుతీరినటువంటి అతి ప్రాచీనమైన 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్వామివారికి ప్రాత కాల సమయం ఉదయం నాలుగు గంటల ప్రారంభ సమయమును సుప్రభాత సేవతో,విష్ణు సహస్రనామ పారాయణతో ఆరాధన కైంకర్యాలు ముగించుకొని ఐదు గంటలకు ఉత్తర ద్వారం గుండా,ద్వారానికి ఆరాధన చేసుకొని ప్రవేశించి స్వామివారికి శాంతియులై మొదలగు కైంకర్యాలు చేసుకొని అనంతరం భక్తాదులందరికీ తీర్థ ప్రసాద వితరణ చేశారు.ఈ దేవాలయం ఎంతో ప్రాచీనమైన దేవాలయంగాను నిత్య కైంకర్యాలు అందుకుంటున్న ఏకైక దేవాలయంగా పేరుగాంచినది.ఇట్టి కార్యక్రమానికి పుష్పాలంకరణ దాతగా చెలిమిల్ల కిష్ణారెడ్డిపేట మాజీ సర్పంచ్ సురగౌని రామన్ గౌడ్ దమయంతి, పూజా కైంకర్య దాత గా బుక్క సత్యనారాయణ నిర్మల మరియు కాషాయ జెండాలు ప్రసాద,దాతగా పెద్ది కొట్లనేషరాములు ఓంకారమ్మ వారి సహకారంతో మరియు గ్రామ ప్రజల సౌజన్యంతో ఉత్తర ద్వారా దర్శనం ఘనంగా నిర్వహించడం జరిగింది.అనంతరం గ్రామ ప్రజలు ఆలయ పూజారి కిట్టు స్వామిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపాలిటీ పరిధి లోగల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.