పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 3, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :
జగ్గయ్యపేట పట్టణంలో మఠం బజార్, గాలి మిషన్ రోడ్డు, ముజీమ్ కాంప్లెక్స్ పక్కన జగ్గయ్యపేట పట్టణానికి చెందిన తూమాటి వెంకన్నకి చెందిన నూతన శ్రీ శ్రీనివాస రైస్ ట్రేడర్స్ ను ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు,శ్రీరాం చిన్నబాబు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎలమంచిలి రాఘవ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్టా వెంకట నరసింహారావు, ధూళిపాళ్ల లక్ష్మణరావు, నియోజకవర్గ బిసి మహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి మరియు వార్డ్ కౌన్సిలర్స్ మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.