
బాగులవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతి శిశు మందిర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అతిథిగా పాల్గొన్నారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ కాన్సెప్ట్ స్కూల్‌ను ప్రారంభించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణను అలవర్చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్ది,ఎం పి గోడం నగేష్, కౌన్సిలర్లు,డాక్టర్స్ మరియు స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.