ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు
షాద్ నగర్ తాలూకా జాయింట్ యాక్షన్ కమిటీ, రంగారెడ్డి జిల్లా
( పయనించే సూర్యుడు మే 26 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లి రైల్వే గేటు సమస్య చాలా ఏళ్లుగా, ఇక్కడి నియోజకవర్గ ప్రజలకు గుదిబండగా మారిందని, ఆరోగ్యపరంగా మరియు వ్యాపార పరంగా అత్యవసర పరిస్థితులలోఎంతోమంది పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న వేళ షాద్ నగర్ శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని చటాన్ పల్లి రైల్వే గేట్ పై నుండి వంతెన నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర నిధులు విడుదలయ్యే విధంగా సాధ్యమైనంత తొందరగా ఒత్తిడి తీసుకొచ్చి 814 కోట్ల రూపాయలను విడుదల చేయించడం జరిగింది. షాద్ నగర్ తాలూకా JAC తరపున పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో ఈ వంతెన నిర్మాణానికి 184 కోట్లు మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా ఈ వంతెన నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కుఅభినందనలు. ఎమ్మెల్యేకు మా షాద్ నగర్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు నియోజకవర్గ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ షాద్ నగర్ తాలూకా చైర్మన్ ఎం.జనార్ధన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్,కన్వీనర్ నక్క బాల్ రాజ్,గొర్ల రాము, అర్జునప్ప, మందారం నరసింహులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు .