
హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ప్రతి పక్ష సభ్యులకు మైక్ ఇవ్వకపోవడం సరైనది కాదు
ప్రోటోకాల్ పాటించని కమీషనర్ తీరుపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసంతృప్తి
నూతన మున్సిపల్ కౌన్సిలర్లను మొదటి సమావేశం సందర్బంగా సన్మానించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు మార్చి 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ మున్సిపల్ లో సమావేశంలో ప్రోటోకాల్ పాటించని మున్సిపల్ కమిషనర్ సునీత గారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.షాద్ నగర్ పురపాలక సంఘం ఆర్ధిక సంవత్సరం 2026-2027 బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరైనారు.ఈ సందర్బంగా సభలో సభ్యులు తమ పట్ల జరుగుతున్న ప్రోటోకాల్ సమస్యను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వార్డు సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడిన వారని తమ వార్డులో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన సభ్యులకు మాత్రమే ఉంటుందని,వారి వార్డులో ఉన్న సమస్యలకు సంబంధించిన పనులు చేయడానికి ప్రపొసల్స్ ను ఇతరులతో తీసుకోవడం సభ్యులను అవమానించినట్టేనని ఇకమీదట ప్రతి వార్డులో జరిగే ఎటువంటి పనికైనా గౌరవ సభ్యుల నుండి మాత్రమే వర్క్ ప్రపోసల్ తీసుకోవాలని ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిషనర్ గారిపైనే ఉందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.ప్రజల చేత ఎన్నుకోబడిన గౌరవ సభ్యులకు వారి వార్డు సమస్యలను తెలియజేయడానికి సభలో మైకు ఇవ్వకపోవడం అభ్యంతరకరమని,రాబోయే సమావేశంలో గౌరవ సభ్యులు తమ సమస్యలను తెలియజేయడానికి వారికి మైక్ కేటాయించేలా చూడాలని సూచించారు.అదేవిదంగా నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ కౌన్సిలర్లను శాలువాతో సత్కరించి సన్మానించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ లు,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
