
షాద్ నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికలలో గెలుపొంది చైర్మన్ గా ఎన్నికైన అగ్గునూరు బసవేశ్వర్,వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్ గౌస్ లను షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ షాద్ నగర్ తాలూకా ఆధ్వర్యంలో తాలూకా జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి కరుణాకర్, గ్రంథాలయ శాఖ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్, బాదేపల్లి సిద్ధార్థ, అర్జునప్ప,టెలిఫోన్ వెంకటయ్య, హెల్త్ అడ్వైజర్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, గోర్ల రాము,ఆర్టీసీ అర్జున్ కుమార్, వీరమల్లు బాలస్వామి,ఎర్ర నర్సింలు,భీశ్వ కృష్ణయ్య,మందారం నరసింహులు,రాజేష్ లు మున్సిపల్ లో నూతనంగా ఎన్నుకున్న చైర్మన్ వైస్ చైర్మన్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..