
రైతు కాలనీలో సీసీ రోడ్ల కు శంకుస్థాపన..
పాల్గొన్న వార్డు ప్రజలు, నాయకులు
( పయనించే సూర్యుడు జనవరి 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రహదారుల ప్రగతి, కాలువల నిర్మాణం ద్వారా షాద్ నగర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిస్థాయిలో మారుస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని రైతు కాలనీ పరిధిలో 10, 27 వార్డులకు సంబంధించిన సీసీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో జయాపజయాలు ఎలా ఉన్నా కాలనీల అభివృద్ధి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఈ రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. మున్సిపాలిటీలో అన్ని వార్డులలోనూ అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ కౌన్సిలర్లు జమృత్ ఖాన్, శ్రావణి, నేతలు చెంది తిరుపతిరెడ్డి, మురళీమోహన్ (అప్పి), అగ్గునూరు బస్వం, అందే మోహన్, రాజేందర్ రెడ్డి, మంగ మధు రైతు కాలనీ వాసి ప్రభాకర్ రెడ్డి మల్లేష్ గౌడ్ అప్పి, ప్రదీప్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
