షాద్ నగర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెస్ నటరాజన్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించే విధంగా పెండింగ్ బిల్లులు మంజూరు చేయనిది మీరే.
( పయనించే సూర్యుడు మార్చే ఐదు షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాన్ని గోక్కోవడం సంప్రదాయంగా మార్చుకున్నారని విద్యా వ్యవస్థను నియోజకవర్గంలో ఎవరు బ్రష్టు పట్టించారో తేల్చుకుందామని షాద్ నగర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెస్ నటరాజన్ సవాల్ విసిరారు. మంగళవారం బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎమ్మెస్ నటరాజన్ మాట్లాడారు. ఫరూక్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ పాఠశాలకు 43.50 లక్షల రూపాయలు మంజూరు చేయించడం వరకు బాగానే ఉంది కానీ అభివృద్ధి పనులు చేసుకోకుండా ప్రతిపక్షంపై అనవసరపు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. గతంలో ఇదే పాఠశాలకు తమ నాయకుడు వై అంజయ్య యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 71 లక్షల రూపాయలు మన ఊరు మనబడి కింద మంజూరు చేయించారని కాంట్రాక్టర్ ఒప్పందం జరిగిందని అయితే తమ ప్రభుత్వం లేని కారణంగా ఆ పనులు అక్కడే నిలిచిపోయాయని గుర్తు చేశారు. అంతకుముందు అదే చోట నిర్మించిన భవనంకు కాంట్రాక్టర్ ఎవరు తెలుసుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నిర్మించిన భవనాలను పరిశీలిస్తే ఎంత నాసిరకంగా కట్టారు అర్థం అవుతుందని నిన్న విమర్శించిన కాంగ్రెస్ నాయకుల్లో సదరు కాంట్రాక్టర్ ఇతరులను విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ నాయకుడు వై అంజయ్య యాదవ్ మన ఊరు మనబడి కింద ఎన్నో పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. గతంలో డిగ్రీ కళాశాల భవనం ఏడు రూములే నిర్మించి ఉండేదని అంజయ్య ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కళాశాలను పూర్తి చేశామని గుర్తు చేశారు. సదరు డిగ్రీ కళాశాలకు 50 లక్షల పైగా వెచ్చించి ప్రహరీ గోడ కడితే దానికి బిల్లు కూడా చెల్లించలేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో కాంగ్రెస్ టిడిపి టిఆర్ఎస్ పార్టీల ప్రభుత్వాలు ఇప్పటివరకు పాలించాయని నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి పనులు మిగిలిన క్రమంలో ఏ ప్రభుత్వం వచ్చిన వాటిని పూర్తిచేసేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి వచ్చాక చేసిన పనులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. సర్వ శిక్ష అభియాన్, మన ఊరు మనబడి ప్లాటి ఎన్నో పథకాలతో అభివృద్ధి పనులు విద్యావికాసం జరిగిందన్నారు. జేపీ దర్గా వద్ద ఎస్సీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ వద్ద కోట్ల రూపాయలు వెచ్చించి భవనం కట్టలేదా అనీ ప్రశ్నించారు. కొందుర్గు వద్ద కస్తూర్బా పాఠశాల భవనాలను నిర్మించలేదా అని ప్రశ్నించారు. తాము విద్య వ్యవస్థకు బలం చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడడం బాగోలేదని అన్నారు. ఎప్పుడు పాడిందే పాటగా ఫరూక్ నగర్ హై స్కూల్ విషయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య విమర్శించడం సరికాదని హితవు పలికారు. అధికార పార్టీని అవకాశం దొరికితే తాము గోకుదామని చూస్తుంటే రివర్స్ గా అధికార పార్టీ నాయకులే తమను గోక్కుంటున్నారని దీనివల్ల నష్టం వాళ్లకే నష్టమని ఎమ్మెస్ నటరాజన్ అన్నారు. పాఠశాల భవనం కూల్చాక టేకు కలప ఏమైంది. ఫరూక్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల భవనం కూల్చివేసిన సమయంలో దానికి సంబంధించిన టేకు కలప ప్రస్తావనకు వచ్చింది. అసలు ఆ కలప ఏమైందని ఎవరు తీసుకున్నారని ప్రశ్నించారు. కలప మాయం చేసింది ఎవరని వారు ఎక్కడి వారని ఈ సందర్భంగా మీడియా సమావేశం సందర్భంగా చర్చకు వచ్చింది. విలువైన కల్ప ఎవరు తీసుకువెళ్లారు ఏం జరిగింది వాటి లబ్ధి ఎవరు పొందారు అన్నది ఇప్పుడు ఈ అంశంలో కొత్త మలుపుగా భావించవచ్చు. ఈ మీడియా సమావేశంలో.. బి ఆర్ ఎస్ నాయకులు చీపిరి రవి యాదవ్ కానుగు అనంతయ్య పిల్లి శేఖర్ గుండు అశోక్ యాదవ్, రాజశేఖర్, శీలం శ్రీకాంత్, చిన్న, జూపల్లి శంకర్, మాజీ ఎంపిటిసి భీశ్వర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..