పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే 15
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా ఈరోజు (టీ.ఏ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని రిలే నిరాహార దీక్షలు ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగల శ్రీనివాసు ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఆదివాసీ అడ్వకేట్ ఆత్రం నవీన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగల శ్రీనివాసు మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ఆదివాసి ఉపాధ్యాయ పోస్టులు మినహాయించి ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని,ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(TAC) ఏర్పాటుచేయాలని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని,జీవో నెంబర్ 3 చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని,ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు మంజూరు చేయాలని,ఆదివాసీ హక్కులు,చట్టాలను పగడ్బందీగా అమలుచేయాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం సిఎం చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు.ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు వందశాతం ఉద్యోగాలను ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అని ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ,రంపచోడవరం డివిజన్ తరుపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ రిలే నిరాహార దీక్షలకు పోడియం పండు దొర,చవలం శుభ కృష్ణ,పండ పవన్,మడకం ప్రసాద్,కారం రామన్నదొర, కుంజం అగ్గిదొర,కత్తుల ఆదిరెడ్డి,ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర,మాజీ సర్పంచ్ సోదే వెంకన్న దొర(అబ్బు), సిహెచ్. విద్యాసాగర్,కొమరం కృష్ణ దొర, కారం రంగారావు,కడబాల రాంబాబు,సమర్త కృష్ణ,బొరగం గంగరాజు,శారపు నాగేశ్వరరావు,మిర్తి వాడ వీరారెడ్డి,సంజీవరెడ్డి,కారం చిన్ని కృష్ణ,బలిజ చిన్నారెడ్డి మరియు మొదలైన నాయకులు పాల్గొన్నారు.